Facebook Posts

Cover for Jayaprada Foundation
462
Jayaprada Foundation

Jayaprada Foundation

Jayaprada Foundation is a charitable not-for-profit organisation that was formed to help the economically deprived by supporting them in areas such as education, employment, health, social welfare and public benefit.

అందరికీ నమస్కారం!📅 30-06-2025 (సోమవారం)📍 వత్సవాయి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లోజయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.ఈ శిబిరంలో క్రింద తెలిపిన సేవలు ఉచితంగా అందించబడతాయి:🔹 నేత్ర వైద్య శిబిరం – కంటి పరీక్షలు, లోపాలున్న వారికి ఉచితంగా కళ్లజోడులు, శుక్లముల ఆపరేషన్లు🔹 ఆర్థోపెడిక్ శిబిరం – మోకాళ్లు, కీళ్ల నొప్పులకు వైద్యం🔹 ENT శిబిరం – చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య సేవలు🔹 జనరల్ వైద్య పరీక్షలు – గ్రామ ప్రజలు మరియు స్కూల్ విద్యార్థులకు🔹 షుగర్ మరియు రక్త పరీక్షలు🔹 అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.#jayapradafoundation #megamedicalcamp #FreeEyeCamp #freehealthcamp #eyecareforall #freemedicines #communityhealth #HealthForAll #NTRDistrict #vatsavai #shankarnetralaya #FreeCheckup #socialservice ... See MoreSee Less
View on Facebook
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంగత వారం గోపినేనిపాలెం గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో భాగంగా, ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తొండపు దశరథ జనార్ధన్ గారి చేతుల మీదుగా 60 మందికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:“సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని పేర్కొంటూ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా కంటికి సంబంధించి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన చికిత్స అందించడమే తమ ధ్యేయమని తెలిపారు.ఇప్పటివరకు:🔹 10 గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించబడి🔹 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి🔹 వారిలో 760 మందికి ఉచిత కళ్లజోడులు అందించబడ్డాయి🔹 140 మందికి శుక్లముల ఆపరేషన్లు విజయవాడ శంకర్ నేత్రాలయం ద్వారా నిర్వహించబడ్డాయిగోపినేనిపాలెం గ్రామంలో 7వ తేదీన పరీక్షలు చేయించిన 53 మందికి త్వరలో శుక్లముల ఆపరేషన్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.కంటిలోపములు ఉన్న గ్రామ ప్రజలు తప్పకుండా తమ గ్రామాల్లో నిర్వహించే ఉచిత కంటి శిబిరాలను వినియోగించుకోవాలని ఫౌండేషన్ సూచించింది.#JayapradaFoundation #FreeEyeCamp #MedicalCamp #HealthCamp #EyeCareForAll #FreeEyeCheckup #FreeSpectaclesDistribution #ShankarNetralaya #NTRDistrict #Vatsavai #CommunityHealth #VisionMatters #HealthcareForAll #ServingThePeople #PublicHealthInitiative #BetterVisionBetterLife #FreeMedicalServices #RuralHealth #SocialService #EyeHealthCampaign #VisionForEveryone #HealthcareOutreach #PreventBlindness #EyeAwareness ... See MoreSee Less
View on Facebook

2 weeks ago

Jayaprada Foundation
మల్కాపురం, ముండ్లపాడు గ్రామాల 21 మందికి కంటి శుక్లముల శస్త్రచికిత్సలు - జయప్రద ఫౌండేషన్, శంకర్ నేత్రాలయం సంయుక్త ఆధ్వర్యంలో.గత వారంలో జయప్రద ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గుర్తించబడిన కంటిలోపాలపై, శంకర్ నేత్రాలయం, విజయవాడ వారి వద్ద శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా,🔹 ముండ్లపాడు గ్రామానికి చెందిన 12 మందికి🔹 మల్కాపురం గ్రామానికి చెందిన 9 మందికిమొత్తం 21 మందికి కంటి శుక్లముల ఆపరేషన్లు విజయవంతంగా చేయబడ్డాయి.#eyesurgery #cataractsurgery #RestoringVision #VisionRecovery #EyeHealthMatters #PreventBlindness #ClearVisionforAll #jayapradafoundation #shankarnetralaya #FreeMedicalCamp #HealthcareWithCompassion #sevathroughhealth #medicalsupportforall #bringinghope ... See MoreSee Less
View on Facebook

2 weeks ago

Jayaprada Foundation
గత మే నెలలో శంకర్ నేత్రాలయం, విజయవాడ వారి వద్ద గౌరవరం మరియు ముండ్లపాడు గ్రామాల నుండి ఎంపికైనవారికి కంటి శుక్లాలు, పొరల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడినవి.తర్వాత గౌరవరం హై స్కూల్‌ లో 26 మందికి, ముండ్లపాడులో 34 మందికి శస్త్రచికిత్స అనంతర ఫాలో అప్ పరీక్షలు నిర్వహించబడ్డాయి.అదేరోజు, ఆయా గ్రామాల్లో కొత్తగా కంటి పరీక్షలు చేయించుకున్న 111 మందిలో,🔹 శుక్లాలు ఉన్నవారు – 25 మంది (ఆపరేషన్‌ అవసరం)🔹 కంటిలోపాలు ఉన్నవారు – 59 మంది (కళ్లజోడ్లు అవసరం)మొత్తంగా 119 మందికి త్వరలో అవసరమైన కళ్లజోడ్లను జయప్రద ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు గ్రామాలలో ఆరోగ్యంపై అవగాహన పెరిగి, కంటి సమస్యల నివారణకు కీలకమైన అడుగులు వేయడం జరిగింది.#jayapradafoundation #EyeCareInitiative #FreeMedicalCamp #VisionForAll #healthcareforrural #ServingCommunities #sevathroughhealth #CompassionInAction #FreeEyeCheckup #EyeHealthMatters #RestoringVision #PreventBlindness #cataractawareness #eyesurgerysupport #glassesforall #ClearVisionAhead ... See MoreSee Less
View on Facebook

2 weeks ago

Jayaprada Foundation
చిల్లకల్లు గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్లజోడ్ల పంపిణీ : 84 మందికి కళ్లజోడ్లు, త్వరలో కంటి శస్త్రచికిత్సలుగత వారంలో జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ హై స్కూల్‌లో జయప్రద ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో, కంటిలోపాలతో గుర్తించబడిన 84 మందికి కళ్లజోడ్లను పంపిణీ చేశారు. ... See MoreSee Less
View on Facebook